ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తన మాటలతో ప్రేక్షకులను మాయ చేసే ఈ దర్శకుడితో పని చేయాలని ప్రతి హీరో ఉవ్విళ్ళూరుతుంటారు. మొన్నామధ్య ఎన్టీఆర్ స్వయంగా తనకు త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేయాలనుందని బహిరంగంగానే చెప్పాడు. అలాంటి త్రివిక్రమ్ ను ఓ యంగ్ హీరో రిజక్ట్ చేసాడంట. త్రివిక్రమ్ ప్రస్తుతం మూలాలను వెతుక్కొనే ప్రయత్నం అనే బలమైన కథతో నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే 'అ ఆ'. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్న బడ్జెట్ లో ఓ సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాకు నిర్మాతగా త్రివిక్రమ్ వ్యవహరించనుండడం విశేషం. అయితే తను అనుకొన్న లైన్ ను చెప్పడానికి ఫాంలో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలను సంప్రదించాడట. అందులో ఒక హీరో త్రివిక్రమ్ లైన్ చెప్పిన వెంటనే నేను మీ సినిమాలో నటించనని నిర్మొహమాటంగా త్రివిక్రమ్ కు చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా త్రివిక్రమ్ సైతం షాక్ అయినట్లు సమాచారం. ఎందరో హీరోలు తనతో పని చేయాలని ఎదురుచూస్తుంటే.. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని ఈ యంగ్ హీరో తిరస్కరించడంతో చేసేదేమీ లేక త్రివిక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడట. నిజానికి త్రివిక్రమ్ తో కలిసి పని చేస్తే సినిమా హిట్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుందని భావించాడట ఈ యంగ్ హీరో. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో త్రివిక్రమ్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదని సదరు హీరో భావించినట్లు టాక్.