Advertisementt

అభిమానులకు డబ్బెక్కడిదీ?

Sat 21st May 2016 12:41 PM
ntr,ntr fans,ntr birthday,ntr news,ntr  అభిమానులకు డబ్బెక్కడిదీ?
అభిమానులకు డబ్బెక్కడిదీ?
Advertisement
Ads by CJ
 జూ.ఎన్టీఆర్ బర్త్ డే కు శుభాకాంక్షలు తెలుపుతూ నిర్మాతలు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం పరిపాటి. ఒక్కోసారి అభిమానుల పేర్లతో సైతం చిన్న చిన్న ప్రకటనలు వస్తుంటాయి. అయితే దీనికి విరుద్దంగా శుక్రవారం జూ.ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ అభిమానులు ఆంధ్రజ్యోతి లో భారీ ప్రకటన ఇచ్చారు. మీడియాలో దీన్ని జాకెట్ యాడ్ అంటారు. దీనికి మామూలుగా తీసుకునే ప్రకటన రేటు కంటే వంద శాతం అధికంగా వసూలు చేస్తారు. ఇది సినిమాకు చెందిన ప్రకటన కాబట్టి కనీసం 10 లక్షల వరకు సంస్థ వసూలు చేస్తుంది. ఇంత భారీ ఎమౌంట్ పెట్టి ప్రకటన ఇచ్చే స్థాయి అభిమానులకు ఉంటుందా అనేది డౌట్. నిజానికి ఈ ప్రకటన అభిమానుల పేరుతో జూ.ఎన్టీఆర్ సంబంధికులే ఇచ్చారని అంటున్నారు. 
 ఇకపోతే శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో జాకెట్ యాడ్ వచ్చింది. హాట్ స్టార్ యాప్ సంస్థ ఇచ్చింది. ఆరు రకాల హావభావాలతో అల్లు అర్జున్ మోడల్ గా దీన్ని ప్రచురించారు. ఈనాడులో ఈ యాడ్ వస్తుందని తెలిసే... జూ.ఎన్టీఆర్ వర్గం ఆంధ్రజ్యోతికి ప్రత్యేక యాడ్ విడుదల చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ