Advertisementt

చిరుతో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది!

Fri 20th May 2016 08:32 PM
katherine theresa,chirajeevi 150th film,anushka  చిరుతో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది!
చిరుతో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది!
Advertisement
Ads by CJ

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ కు తెలుగులో ఆశించిన గుర్తింపు దొరకలేదు. అయినా 'రుద్రమదేవి','సరైనోడు' చిత్రాలతో వరుసగా బన్నీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందీ.. భామ. రుద్రమదేవి తో అంత ఫేం రాకపోయినా.. సరైనోడు సినిమా మాత్రం ఈ అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏకంగా మెగాస్టార్ పక్కన స్టెప్పులేసే అవకాశం కేథరిన్ ను వెతుక్కుంటూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో తన 150వ చిత్రంగా 'కత్తి' సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను ఎన్నుకొన్నట్లు సమాచారం. మెగాస్టార్ పక్కన హీరోయిన్ అనగానే అనుష్క కాదనకుండా వెంటనే ఒప్పేసుకుందట. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉండడంతో ఆ రోల్ లో కేథరిన్ ను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కేథరిన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. చిరంజీవితో కొన్ని సీన్లలో నటించడం మాత్రమే కాదు.. ఆయన సరసన ఒక పాటకు స్టెప్పులు కూడా వేయడానికి రెడీ అవుతోందట ఈ దుబాయ్ బ్యూటీ. ఇక భవిష్యత్తులో తెలుగులో తనకు మంచి అవకాశాలు రావడం ఖాయమని కేథరిన్ భావిస్తోంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ