ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రాలతో నేచురల్ స్టార్‌గా ఎదిగి హ్యాట్రిక్ విజయాలు సాధించి తన బిజినెస్ రేంజ్‌ను 25కోట్ల వరకుపెంచుకున్న హీరో నాని, భలే భలే మగాడివోయ్ చిత్రంలో మతిమరుపు, కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంలో పిరికితనం వంటి వాటితో ఆకట్టుకున్న నాని జెంటిల్‌మేన్ లో కన్ఫ్యూజన్ మాస్టారిగా కనిపించనున్నాడు. కాగా ఇప్పటివరకు తన కెరీర్‌లో యాక్షన్ చిత్రాలను సరిగా చేయని నాని గురువు ఇండ్రగంటి మోహనకృష్ణతో పాటు నాని నటిస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ కామెడీగా రూపొందుతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ట్రైలర్ చూసిన వారు ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం విషయంలో నాని, ఇంద్రగంటిలు స్పెషల్ జోనర్‌ను టచ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆడియోను ఈనెల 22న విడుదల చేసి జూన్10న చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత శ్రీదేవి మూవీస్ బేనర్‌లో ఎన్నో భారీబడ్జెట్, అండ్ సెలక్టెడ్ మూవీస్‌ను చేసి తనకంటూ ప్రత్యేక అభిరుచిని చాటుకున్న శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రంపై భారీఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా సురభి, నివేదిక థామస్‌లు నటిస్తున్నారు. మరి నాని ఈ చిత్రంలో హీరోనా? లేక విలనా? అనేది సినిమా చూస్తేకానీ తెలియదు.