Advertisementt

జనతా గ్యారేజ్ జాగ్రత్తలన్నీ ఆ ఫిగర్ కోసమేనా!

Fri 20th May 2016 12:38 PM
jr ntr,janatha garage,janatha garage first look,jantha garage news,janatha garage updates,jr ntr,jr ntr birthday,samantha,nithya menon,koratala,mytri movies  జనతా గ్యారేజ్ జాగ్రత్తలన్నీ ఆ ఫిగర్ కోసమేనా!
జనతా గ్యారేజ్ జాగ్రత్తలన్నీ ఆ ఫిగర్ కోసమేనా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా సమంత, నిత్యామీనన్‌, మోహన్‌లాల్‌, ఉన్నిముకుందన్‌ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'జనతాగ్యారేజ్‌' ఫస్ట్‌లుక్‌ గురువారం సాయంత్రం 6గంటలకు విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిందే. ఈ మూడు భాషల్లోనూ ఈచిత్రానికి 'జనతాగ్యారేజ్‌' అనే టైటిల్‌నే కన్‌ఫర్మ్‌ చేసారు. అయితే ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ ఫస్ట్‌లుక్‌ని మోహన్‌లాల్‌ బర్త్‌డే కానుకగా ఈ నెల 21న, టీజర్‌ను స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 27న తెలుగుతోపాటు మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి 'జనతాగ్యారేజ్‌' విషయంలో హీరో ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలైన మైత్రి మూవీస్‌ సంస్ధ అధినేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవానికి 'నాన్నకుప్రేమతో' చిత్రం 50కోట్లు కలెక్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ తొలి చిత్రమే అయినా బడ్జెట్‌ రీత్యా చూస్తే మాత్రం ఆ చిత్రాన్ని యావరేజ్‌ చిత్రంగానే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే 'జనతాగ్యారేజ్‌' ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 60కోట్ల వరకు చేరింది. సో.. ఈచిత్రం సరైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎన్టీఆర్ ని 100కోట్ల క్లబ్‌లోకి చేరుస్తుందేమో చూద్దాం. 

 ఎన్టీఆర్ బర్తడే సందర్భం గా రిలీజ్ చేసిన 'జనతాగ్యారేజ్‌' ఫస్ట్ లుక్ ప్రేక్షకులను, ఎన్టీఆర్ అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ