Advertisementt

జగన్‌, కేటీఆర్‌, లోకేష్‌లలో ఎవరు బెస్ట్‌...!

Fri 20th May 2016 12:12 PM
ysr son jagan,kcr son ktr,chandrababu naidu son lokesh,top 1,2019 elections   జగన్‌, కేటీఆర్‌, లోకేష్‌లలో ఎవరు బెస్ట్‌...!
జగన్‌, కేటీఆర్‌, లోకేష్‌లలో ఎవరు బెస్ట్‌...!
Advertisement
Ads by CJ

ఎంతకాదన్నా మన దేశంలోని అన్నిరంగాల్లో వారసత్వ పోరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలు, సినిమాలలో ఈ పోరు మరింత ఎక్కువ. ఇక మన తెలుగువారి విషయానికి వస్తే అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ రాజకీయ వారసత్వ పోరు తప్పడం లేదు. తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడనే చెడ్డ పేరు ఉంది. ఈ విషయంలో ఆయన పలు కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా జగన్‌ అంటే రాజకీయాల్లో నేడు ఓ శక్తిగా మారాడు. తన తండ్రికి ఉన్న సింపతీని ఆయన నిలబెట్టుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఏపీలో చక్రం తిప్పే స్దాయిలోనే ఉన్నాడు. అయితే ఆయనపై అవినీతి బాబు అనే మచ్చ ఉండనే ఉంది. ఇక కేటీఆర్‌ విషయానికి వస్తే ఆయన కేసీఆర్‌ తనయునిగా తండ్రి తర్వాత నెంబర్‌ టూ స్దానాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈయనకు తన తర్వాత పగ్గాలు ఇవ్వాలనే కోరిక కేసీఆర్‌లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయతే ఈయన్ను ఆయన వ్యతిరేకులు కంత్రీబాబు అని పిలుస్తుంటారు. ఇక చంద్రబాబు తనయుడి విషయానికి వస్తే ఆ పార్టీ నాయకులంతా ఇప్పటినుంచే నారా లోకేష్‌ను యువరాజు అంటున్నారు. ఆయన కోసం తమ పదవులను కూడా వదులుకోవడానికి సిద్దం అవుతున్నారు.ఆయన మాత్రం తాను 2019కి ఫిక్సయ్యాను అంటున్నాడు. కానీ గ్రేటర్‌ ఎన్నికల్లో ఆయన సారధ్యంలో టిడిపి ఘోర వైఫల్యాలను చవిచూసింది. కానీ ఇక్కడ నారా లోకేష్‌ను ప్రతిపక్షాలు మొద్దబ్బాయ్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. మరి వీరి ముగ్గురిలో స్వంతంగా పరిపాలనాదక్షత, ఎన్నికల్లో గెలిచే సత్తా? తమ తండ్రుల స్ధానాన్ని భర్తీ చేయగల సామర్ధ్యం ఎవరికి ఉందో భవిష్యత్తే తేల్చాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ