వై.యస్.జగన్ జలదీక్ష వర్కవుట్ అయింది. 72 గంటల పాటు కర్నూలులో హడావుడి చేసిన జగన్ వల్ల తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్న ప్రాజెక్ట్ లు ఆగలేదు. అవికడితే చుక్కనీరు రాదని ఆందోళన వ్యక్తం చేసిన జగన్ మోర ఆలకించిన వరుణదేవుడు ఏకంగా తుపాన్ శాంక్షన్ చేశాడని రాజకీయ సర్కిల్లో సరదాగా చెప్పుకుంటున్నరు.
ఆంధ్రప్రదేశ్ కు రోను తుపాను పొంచి ఉంది. దీనివల్ల తీవ్రవర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నెల్లూరు మునిగింది. ఇదంతా జలదీక్ష ప్రభావమే అనుకోవాలి. ఇప్పుడు వైకాపా కార్యకర్తలు సైతం జలంతో మునగనున్న తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. గురువారం వరకు జలదీక్ష చేసిన జగన్ ప్రతిపక్షనేతగా ఆంధ్రప్రజలను తుపాను నుండి రక్షించడానికి కార్యచరణ చేయాలి. అప్పుడేమో జలం కోసం ఇప్పుడేమో జనం కోసం ఆయన రంగంలోకి దిగాలి.