బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ చిత్రంలో దగ్గుబాటి హీరో రానా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. క్రిష్ ప్రత్యేకంగా రానాకు కథ వివరించాడని, బిజినెస్ పరంగా కూడా రానా హెల్ప్ అవుతాడని ఆలోచించి తనను ఈ సినిమాలో సెలక్ట్ చేసుకున్నారని కొన్ని వార్తలు ప్రచురింపబడ్డాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రబృందం వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మొరకాలో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలో కీలకమైన యుద్ధ సన్నివేశాలను ఆ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అక్కడ షెడ్యూల్ పూర్తయిన వెంటనే.. హైదరబాద్ లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ కు దగ్గరలో సుమారుగా పది ఎకరాల స్థలంలో భారీ సెట్ వేసి షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం.