Advertisementt

చరణ్ బాగా మాట్లాడాడు...!

Fri 20th May 2016 08:12 AM
ram charan,oka manasu,ram charan mature speech,oka manasu audio launch,niharika  చరణ్ బాగా మాట్లాడాడు...!
చరణ్ బాగా మాట్లాడాడు...!
Advertisement
Ads by CJ

వారసులుగా పుత్రరత్నాలనే పరిచయం చేసే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ నాగబాబు తన కుమార్తె నిహారికను హీరోయిన్ గా పరిచయం చేస్తుండడం అభినందనీయమే. కొడుకులే వారసులు అనే భావన నుండి మెగాకుటుంబం బయటపడింది. సినీరంగంపై ఆడపిల్లలకు కూడా ఆసక్తి ఉంటే  ప్రోత్సహించడం, వారు రాణించేలా అండగా ఉండడం ఇంకా కొందరు తెలుగు నటులు నేర్చుకోవాలి. సినిమారంగంపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ అవి వాస్తవం కాదని నిహారిక తెరంగేట్రం సంకేతం ఇచ్చింది. 

నిహారిక తొలి చిత్రం ఒక మనసు ఆడియో వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్ మినహా మిగతా మెగా కుటుంబ నటులు హాజరయ్యారు. అందరూ ఆల్ ది బెస్ట్ చెబితే రామ్ చరణ్ మాత్రం ఒక కొత్త హీరోయిన్ పరిచయం సందర్భంలో కావాల్సిన ఎంకరేజ్ మెంట్ ను తమ మాటల ద్వారా అందించారు. తనకు సోదరి అయినప్పటికీ నిహారికను కొత్త నటిగానే భావించి, ఆ విధంగానే మాట్లాడారు. ఆమె అభినయాన్ని, అందాన్ని మెచ్చుకుని ప్రశంసలు అందజేశారు. కొత్తగా వస్తున్నవారికి సరిగ్గా ఇలాంటి ప్రోత్సాహమే కావాలి. అది తన మాటల్లో చూపించారు చరణ్. అందుకే అతని స్పీచ్ కు అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. 

అల్లు అర్జున్ మాత్రం హడావుడికి వచ్చి పవన్ గురించి మాట్లాడేసి అంతే వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అంత అర్జంట్ పనేమిటో ఆయనకే తెలియాలి. అల్లు అర్జున్ చివరి వరకు ఉంటే బావుండేది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ