రజనీకాంత్‌కు ఈ మధ్య విజయాలు లేవు. 'కొచ్చాడయాన్(విక్రమసింహా), లింగా' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడంతోపాటు ఆయనకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుండి కూడా ఎన్నో సమస్యలు తలెత్తి రజనీకాంత్‌కు మచ్చ తెచ్చాయి. రంజిత్‌పా దర్శకత్వంలో కలైపులి థాను నిర్మాణంలో తెరకెక్కిన 'కబాలి' చిత్రానికి పై రెండు చిత్రాల ఎఫెక్ట్ తగులుతుందని అందరూ భావించారు. అదే రజనీ కాకుండా మరో హీరో ఎవరికైనా సరే ఆ రెండు చిత్రాల ఫలితాలు ప్రీరిలీజ్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడేవి.కానీ రజనీ అంటే సమ్‌థింగ్ స్పెషల్. దాంతో ఆయన నటిస్తున్న 'కబాలి' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపుగా సాగుతోంది. 60సెకన్ల టీజర్‌తో రజనీ మరోసారి మాయ చేశాడు. ఆయన తనకు భాషతో, ఇండస్ట్రీతో పనిలేదని మరోసారి నిరూపించుకుంటున్నాడు. టాలీవుడ్‌లో రజిని నటించిన 'బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో' వంటి చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. ఇప్పటికే తమిళ 'కబాలి' బిజినెస్ కేవలం తమిళంలోనే 120 కోట్ల వరకు జరిగింది. ఇక తెలుగులో ఈ చిత్రం రైట్స్ 30 కోట్లకు పైగా పలుకుతున్నాయి. టాలీవుడ్‌లో 30కోట్లు అంటే ఓ స్టార్ హీరోతో ఏకంగా ఓ చిత్రమే తీయవచ్చు. కానీ రజనీ మాయ చూసిన తెలుగు నిర్మాతలు 30కోట్లకు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు. మరి మొత్తానికి 'కబాలి' చిత్రం ఎంతటి లాభాలను గడించి రేసులో ముందుంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. రజనీ అభిమానులు మాత్రం 'కబాలి' చిత్రం కలెక్షన్లపరంగా కూడా సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు.