Advertisementt

మహేష్‌ స్టైల్‌ అదిరిపోతుందంటున్నారు...!

Thu 19th May 2016 07:25 PM
mahesh babu,brahmotsavam movie,mahesh style,handsome,special care  మహేష్‌ స్టైల్‌ అదిరిపోతుందంటున్నారు...!
మహేష్‌ స్టైల్‌ అదిరిపోతుందంటున్నారు...!
Advertisement
Ads by CJ

స్వతహాగా మహేష్‌బాబు మంచి అందగాడు. శోభన్‌బాబు తర్వాత లేడీస్‌లో అంతటి ఇమేజ్‌ ఉన్న హీరో అయన. అందుకే యూత్‌, లేడీస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన చిత్రాలంటే ఎక్కడ లేని ప్రత్యేకమైన క్రేజ్‌. కాగా ఆయన తాజాగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌లో ఆయన భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్‌ను సింపుల్‌గా, స్టైలిష్‌గా చూపించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడట. అందులో ఆయన కోసం సింపుల్‌ కాస్ట్యూమ్స్‌ను, అందంగా మహేష్‌ కోసం స్పెషల్‌ కేర్‌ తీసుకొని డిజైన్‌ చేయించాడని      సమాచారం. వాస్తవానికి పెద్ద హీరోల చిత్రాలలో అంటే అందులోని హీరోలుకు దాదాపు 30 రకాల కాస్టూమ్స్‌ వాడుతుంటారు. కానీ బ్రహ్మోత్సవం లో మాత్రం మహేష్‌ కోసం ఏకంగా 100 కాస్ట్యూమ్స్‌ను వాడారని సమాచారం. దీనికే పెద్ద బడ్జెట్‌ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌ స్టైలిష్ట్‌ అక్షయ్‌త్యాగి స్వయంగా తెలియజేశాడు. సో.. ఈ చిత్రంలో మహేష్‌ మరింత స్పెషల్‌గా అందరినీ ఆకట్టుకోనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ