Advertisementt

సీనియర్ హీరోకు పోలీసుల ఫైన్!

Thu 19th May 2016 03:38 PM
raviteja,traffic police,car,black film  సీనియర్ హీరోకు పోలీసుల ఫైన్!
సీనియర్ హీరోకు పోలీసుల ఫైన్!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీస్ వారు సెలబ్రిటీలందరకీ ఫైన్స్ వేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిల్మ్ వేశారని సారధి స్టూడియోస్ దగ్గరలో కారును నిలిపి వేసి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. సరిగ్గా ఇదే కారణంతో మాస్ మహారాజా రవితేజ ఏపీ 28 డీకే 4742 నంబరు గల కారును జూబ్లీ హిల్స్ పోలీసులు ఆపారు. కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి అక్కడికక్కడే నిబంధనల ప్రకారం 800 రూపాయల ఫైన్ ను విధించారు. ఆ జరిమానా చెల్లించిన రవితేజ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. 'బెంగాల్ టైగర్' సినిమాతో హిట్ కొట్టిన ఈ సీనియర్ హీరో ప్రస్తుతం 'రాబిన్ హుడ్' అనే చిత్రంలో అలానే సుదీర్ వర్మ దర్సకత్వంలో మరో సినిమాను చేయడానికి అంగీకరించారు. కొన్ని రోజుల తరువాత ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ