తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్‌పోల్స్ సూచిస్తున్నాయి. అదే జరిగితే కరుణానిధి తన 92వ జన్మదినోత్సవం అంటే జూన్3 నాటికి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇక డీఎంకె అధికారంలోకి వచ్చిదంటే మాత్రం మరలా జయలలితకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి కేసులు పెట్టి వేదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే జయలలిత కూడా సీఎం అయిన తర్వాత చేసిన పని అదే. డీఎంకే నాయకులపై అనేక కేసులు పెట్టి నానాయాగీ చేసింది. ఇక మరోవైపు అమ్మ పదవిలోకి రాకపోతే ఆమె పట్ల కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఎలా స్పందిస్తుంది? అనే అంశం కూడా చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో జయలలితతో పొత్తు పెట్టుకోవాలని బిజెపి ఆశించింది. కానీ అమ్మ మాత్రం తన గెలుపుపై ఎంతో నమ్మకంతో బిజెపిని అవమానపరిచింది. చివరకు విజయ్‌కాంత్ కూడా బిజెపిని అవమానపరిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో తమతో పొత్తు పెట్టుకోకుండా తమను అవమానించిన అమ్మపై బిజెపి గుర్రుగాఉంది.దాంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న జయలలిత కేసును కేంద్రం వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని, మరోపక్క ఇప్పటికైనా ఆమె బిజెపికి అనుకూలంగా ప్రవర్తిస్తే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి ఆమెతో కలిసి పనిచేసే ఉద్దేశ్యంలో కూడా ఉన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి.