Advertisementt

మహేష్ వలన ఆ హీరోకు ఎఫెక్ట్!

Thu 19th May 2016 09:08 AM
mahesh babu,brahmothswam,surya,24 movie  మహేష్ వలన ఆ హీరోకు ఎఫెక్ట్!
మహేష్ వలన ఆ హీరోకు ఎఫెక్ట్!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న 'బ్రహ్మోత్సవం' సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాత పివిపి వీలైనన్ని థియేటర్స్ ను కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం వెయ్యి థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడానికి పివిపి చేయని ప్రయత్నం లేదు. దీనికోసం చాలా చోట్ల బన్నీ 'సరైనోడు', సూర్య '24', సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమాలు ఆడుతున్న థియేటర్ల నుండి ఆ సినిమాలను తీసేయాలని అనుకుంటున్నారు. అయితే 'సరైనోడు' సినిమాను మాత్రం నిర్మాత అల్లు అరవింద్ టచ్ చేయనివ్వకుండా తన స్టైల్ లో అడ్డుకుంటున్నాడు. ఇలా చేయడం వలన మహేష్ ఫ్యాన్స్ అందరూ.. అల్లు అరవింద్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా 'బ్రహ్మోత్సవం' వల్ల ఎఫెక్ట్ అయ్యే సినిమాలు '24','సుప్రీమ్'లే. ముఖ్యంగా సూర్యకు బ్రహ్మోత్సవం వలన ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన '24'కు ఓపెనింగ్స్ మంచి స్థాయిలో వచ్చినప్పటికీ నిర్మాత లాభ పడాలంటే ఇంకొన్ని రోజులు సినిమాను ప్రదర్శించాల్సివుంది. కాని మహేష్ 'బ్రహ్మోత్సవం' వలన చాలా థియేటర్స్ నుండి '24'ను తీసేయడం వలన ఆ ఒత్తిడికి సూర్య తల పట్టుకున్నట్లు టాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ