మన దేశం కుహనా మేథావులకు, కుహనా ప్రజాస్వామ్యవాదులకు, కుహనా లౌకికవాదులకు నిలయం. ఇక్కడ ఎవరైనా ఎవరి మీదనైనా విమర్శలు చేయవచ్చు. అదేమని ప్రశ్నిస్తే తమకు తమ అభిప్రాయలు చెప్పే స్వేచ్ఛ ఉందని వాదిస్తారు. అదే సమయంలో ఇతరులను బాధించి, వారి మనోభావాలను గాయపడకుండా చూడాలనే ఇంగితజ్ఞానం ఉండదు. చివరకు మహాత్మాగాంధీని కూడా విమర్శించే వారికి కొదువలేదు. అదేమంటే తమ భావప్రకటనాస్వేచ్ఛ అంటారు. ప్రభుత్వాలు కూడా ఓట్ల బ్యాంకు రాజకీయాలను నమ్ముకోవడంతో ఎవ్వరిని ఏమి అనలేని పరిస్థితి. కాగా ఇటీవల దళిత కుహనా మేధావి కంచ ఐలయ్య హిందూ దేవుళ్లపై, బ్రాహ్మణులపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రాహ్మణులు కూర్చొని తినే సోమరిపోతులని వ్యాఖ్యానించాడు. అయితే పెద్దగా ఓటు బ్యాంకు లేని బ్రాహ్మణులు ఆయన వ్యాఖ్యలను మాత్రమే ఖండించారు. అదే వేరే కులంపై ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఇప్పటికే రాష్ట్రం భగ్గుమని మండేది. కానీ బ్రాహ్మణుల చేతగాని తనాన్ని అలుసుగా తీసుకొని, తనకు తాను మేథావిగా భావించుకొని వార్తల్లో నిలవడం కోసమే కంచ ఐలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
దీంతో కంచెఐలయ్య చేసిన వ్యాఖ్యలపై మాజీ రాష్ట్ర సీ.ఎస్. ఐ.వై.ఆర్.కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. దాంతో పాటు మరో న్యాయవాది ఈ విషయంలో కోర్టువరకు వెళ్లారు. దీంతో కంచ ఐలయ్య బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాడు. తాను బ్రాహ్మణీజానికి వ్యతిరేకినే గానీ బ్రాహ్మణులపై తనకే మాత్రం ద్వేషం లేదని సమర్ధించుకున్నారు. అదే హిందూ మతంపై, దేవుళ్లపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఐలయ్యకు ఇతర మతాలు, కులాలపై కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసే దమ్ము దైర్యం ఉన్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.