Advertisementt

పవన్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు!

Wed 18th May 2016 07:33 PM
pawan kalyan,sardhar gabbar singh,s.j.surya,sruthi hassan,pollachi  పవన్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు!
పవన్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తన ప్రతిభను నిరూపించుకొని ఇప్పుడు రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి సిద్ధమవుతున్నాడు. 2019లో జరిగే ఎన్నికల్లో తన సొంత పార్టీ జనసేన తరఫున పోటీ చేయనున్నాడు. అయితే ఈలోపు తను చేయగలిగినన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నాడు. రీసెంట్ గా భారీ అంచనాల మధ్య విడుదలయిన పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. దీంతో పవన్ కూడా తన మనసును మార్చుకొని సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నట్లు టాక్. తనకు 'ఖుషి' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన ఎస్.జె.సూర్యతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. 'పొల్లాచి' ప్రాంతంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. గతంలో పొల్లాచి ప్రాంతంలో చిత్రీకరించిన పవన్ సినిమాలు చాలా వరకు విజయాలు అందుకున్నాయి. అదే సెంటిమెంట్ తో తన కొత్త సినిమాను కూడా అక్కడే షూట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట. అంతేకాదు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రుతినే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. త్వరలోనే పవన్, శ్రుతిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను 'పొల్లాచి' లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ