అల్లు అర్జున్ కు వయసు పెరుగుతున్న కొద్ది మైండ్ సెట్ మారుతోంది. తండ్రి అయ్యాక ఇంకా మార్పు కనిపిస్తోంది. జీవితంలో అన్నీ సాధించేశాను అనే భ్రమలోఉన్నాడా? ఈ అనుమానం చాలామందికి కలుగుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పిన ఒకే ఒక మాట పెద్ద దుమారాన్నే లేపినప్పటికీ, 'అతను నిజమే చెప్పాడని' పవన్ అభిమానులు అంటున్నారు. వారి ఉద్దేశం ఏమంటే పవర్ స్టార్ గురించి ఎలాంటి వ్యాఖ్య చేసే స్థాయి అల్లు అర్జున్ కు లేదనేది. పవన్ కు సక్సెస్ ఉన్నా లేకున్నా ఆయన ఇమేజ్ లో ఎలాంటి తేడా ఉండదు. అదే అల్లు వారబ్బాయికి కేవలం ఒక ఫ్లాప్ వస్తే తేడా వస్తుంది. ఇక పవన్ హిట్ కొడితే క్రెడిట్ ఆయనకే చెందుతుంది. అదే అల్లు అర్జున్ తాజా హిట్ క్రెడిట్ 'సరైనోడు' దర్శకుడు బోయపాటికి వెళ్ళింది.
ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. గడచిన ఎన్నికల్లో తెదేపా, బిజేపి కూటమి తరుపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూగో, పగో జిల్లాల్లో తెదేపా స్వీప్ చేయడానికి పవన్ కారణం. ఈ రెండు జిల్లాల్లో పవన్ కారణంగా ఎక్కువ సీట్లు వచ్చాయి. అందువల్లే తెదేపా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగింది. ఈ విషయం మీడియా సైతం అంగీకరించింది.
ఇక అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున అదే ఎన్నికల్లో పోటీ చేశారు. అత్యంత ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ తెదేపా గెలవగా, తెరాస నాలుగవ స్థానంలో నిలిచింది. కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే మామగారికి వచ్చాయి. మామ తరుపున ప్రత్యక్షంగా ప్రచారం చేయనప్పటికీ, నియోజకవర్గంలో అల్లు అర్జున్, చిరంజీవి ఫ్లెక్సీలు ఉపయోగించారు. మామ గెలుపుకు అల్లుగారబ్బాయి ఏ విధంగా ఉపయోగపడలేకపోయారు. ఇదీ ఆయనకున్న ఫాలోయింగ్.
పవన్ కల్యాణ్ ఇమేజ్ కంటే ఎక్కడో అడుగుబాగాన ఉన్న అల్లు అర్జున్ ఒకరి గురించి ముఖ్యంగా పవన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమే అనిపిస్తోంది.