ఏపీ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంపై నిన్నటివరకు పర్యావరణ శాఖ తప్పుపట్టింది. తాజాగా ఢిల్లీకి చెందిన నేచురల్ హెరిటేజ్ ఫస్ట్ సంస్థ కూడా అమరావతిని రాజధానిగా ఎంపికచేయడం సరైన చర్య కాదని తేల్చిచెప్పింది. ప్రొఫెసర్ విక్రమ్ సోనీ ఆధ్వర్యంలో అమరావతిని సందర్శించిన నేచురల్ హెరిటేజ్ బృందం రాజధాని కోసం ప్రభుత్వం తయారుచేసిన మాస్టర్‌ప్లాన్‌ను స్టడీ చేసింది. ప్లాన్‌ను అనుసరిస్తూ రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో భారీ ముప్పు తప్పదని హెచ్చరిక చేసింది. రాజధానికి ఆనుకొని ఉన్న నదికి ఇరువైపులా రెండున్నర కిలోమీటర్లు వరకు భారీగా ఇసుక పేరుకు పోయి ఉందని తేల్చిచెప్పింది. అక్కడ 40 మీటర్ల లోతు వరకు ఇసుక పొరే ఉందని, ఇలాంటి చోట నిర్మాణాలు చేపట్టడం ఏమాత్రం సహేతుకం కాదని, నదిలో నీరు ఎక్కువైతే ఇసుక పొరల్లోకి నీరు జొరపడి సమీపంలోని నిర్మాణాలు నేలమట్టం అవుతాయని ...భూగర్భ జాలాలు కూడా అడుగంటి పర్యావరణానికి తీవ్ర ముప్పు దాగుందని నేచురల్ హెరిటేజ్ బృందం తేల్చిచెప్పింది.