హిట్ సినిమాలలోని సన్నివేశాలను, పాత్రలను స్ఫూఫ్ చేసి నవ్వించడం మన దర్శకులకు మామూలే. అదే పద్దతిలో ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఓ పెద్ద హీరో చిత్రంలో స్ఫూఫ్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఆ ఎపిసోడే హైలైట్ అవుతుందని అంటున్నారు. వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రంలో ఈ స్ఫూఫ్ ఉండనుంది. ఈ స్ఫూఫ్‌ని సప్తగిరిపై చిత్రీకరించారని సమాచారం. ఈ ఏపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఈ సినిమాకు ఇదే హైలైట్ కానుందని తెలుస్తోంది. దాదాపు 10నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉంటుంది. అలాగే వెంకీపై వచ్చే ఇంట్రో సాంగ్ కూడా బాగుంటుందని టాక్ వస్తోంది. 'వెంకటేసు.. వెంకటేసూ... దగ్గుబాటి బాసు... బాబు మనసు అచ్చమైన బంగారం గొలుసు' అంటూ ఈ పాట సాగుతుందని తెలుస్తోంది.