Advertisementt

బన్నీకి చిరంజీవి క్లాస్!

Tue 17th May 2016 06:58 PM
allu arjun,sarainodu,chiranjeevi,fans  బన్నీకి చిరంజీవి క్లాస్!
బన్నీకి చిరంజీవి క్లాస్!
Advertisement
Ads by CJ

బన్నీ నటించిన 'సరైనోడు' సినిమా బ్లాక్ బాస్టర్ ఫంక్షన్ విజయవాడలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ ను అభిమానులు పవన్ గురించి ఏదైనా మాట్లాడమని అడిగారు. దీనికి సమాధానంగా బన్నీ 'చెప్పను బ్రదర్' అన్నాడు. ప్రత్యేకంగా బన్నీ, పవన్ ను ఏమి అనకపోయినా.. పవన్ గురించి చెప్పను అనే మాట పవన్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా బన్నీకు యాంటీగా తయారయ్యారు. తనకు కౌంటర్ ఇచ్చే విధంగా 'చూసుకుంటాం బ్రదర్' అంటూ పబ్లిక్ పోస్టర్స్ ను డిజైన్ చేసి ఇన్ డైరెక్ట్ గా బన్నీకు వార్నింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా బన్నీ ఇదే మాటను రిపీట్ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సరైనోడు సినిమా ఫంక్షన్ లో పవన్ గురించి నేనేమి మాట్లాడానని చెప్పేస్తున్నాడు. ఈ విషయాలు చిరంజీవి వరకు వెళ్ళడంతో బన్నీను పిలిచి చిరంజీవి పెద్ద క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. బన్నీను ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించిన చిరు ఫ్యాన్స్ తో ఎలా ఉండాలి..? వారితో ఎలా మెలిగితే మంచి స్థాయిలో ఉంటామనే విషయాలు చెప్పాడట. అభిమానుల విషయంలో నువ్వు వ్యవహరించే తీరు సరిగ్గా లేదని, వాళ్ళ సపోర్ట్ లేకుండా మనమేమీ చేయలేమని బన్నీకు వివరించాడట. ఈ వివాదం మరింత ముదరకముందే నాగబాబుని ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వివాదం సద్దుమనిగేలా చేయమని చెప్పినట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ