Advertisementt

'బ్రహ్మోత్సవం' సెన్సార్‌ పూర్తి!

Tue 17th May 2016 11:30 AM
brahmotsavam,censor complete,brahmotsavam censor matter,mahesh babu,pvp  'బ్రహ్మోత్సవం'  సెన్సార్‌ పూర్తి!
'బ్రహ్మోత్సవం' సెన్సార్‌ పూర్తి!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. 

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - మా బేనర్‌లో వస్తోన్న మరో ప్రెస్టీజియస్‌ మూవీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' పొందింది. ఒక అధ్బుతమైన చిత్రాన్ని తీసారని సెన్సార్ సభ్యులు అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా మే 20న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి అన్ని చోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో సినిమాపై వున్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని మా 'బ్రహ్మోత్సవం' డెఫినెట్‌గా రీచ్‌ అవుతుంది.. అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ