మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. తమిళంలో హిట్ అయిన 'కత్తి' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. అయితే ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ ఎక్కువగా తన సినిమాలో హీరోతో ఒక పాటను పాడిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోలతో పాడించాడు. గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావుతో ఒక బిట్ సాంగ్ ను కూడా పాడించాడు. అలానే చిరంజీవి 150వ సినిమాలో కూడా చిరు పాట పాడేలా ప్లాన్ చేస్తున్నాడట దేవి. దీనికోసం చిరు దగ్గర నుండి ప్రామిస్ కూడా తీసుకున్నాడట. కేవలం ఒక్క పాటతో చిరుని వదలకుండా మరో బిట్ సాంగ్ ను కూడా దేవిశ్రీ రెడీ చేస్తున్నాడంట. ఈ రెండు పాటలను చిరంజీవి పాడబోతున్నట్లు తెలుస్తోంది.