Advertisementt

అనసూయ అసలు తగ్గట్లేదుగా..!

Mon 16th May 2016 07:06 PM
anasuya,remuneration,40 lakhs,producers  అనసూయ అసలు తగ్గట్లేదుగా..!
అనసూయ అసలు తగ్గట్లేదుగా..!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై హాట్ యాంకర్ గా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో నటించడం కూడా మొదలుపెట్టింది. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' చిత్రాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇలా రెండు సినిమాలు హిట్ అయ్యాయో.. లేదో.. అమ్మడు కొండెక్కి కూర్చుంది. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. సుమారుగా నలబై లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. దీంతో అనసూయతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అయినా.. అనసూయను హీరోయిన్ గా ప్రేక్షకులు ఆదరిస్తారనే అనేది డౌటే. ఇరవై లక్షల్లో నటించడానికి చాలా మంది కొత్త హీరోయిన్లు ఉన్నారు. సో.. ఈ అమ్మడుని పక్కన పెట్టేసి కొత్త హీరోయిన్లకే మొగ్గు చూపుతున్నారు నిర్మాతలు. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని భావిస్తోన్న అనసూయ అవకాశాలు తగ్గినా.. పర్లేదు కానీ రెమ్యునరేషన్ మాత్రం తగ్గించేదే లేదని మొండిపట్టు పట్టిందట. ప్రస్తుతం అయితే ఈ భామ పివిపి బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయింది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ