మొదట్లో రామ్‌చరణ్‌తో ఓ అందమైన ప్రేమకథని చేయాలనుకున్నాడు సుకుమార్. కానీ ఆయన ఒక్కసారిగా ఆ నిర్ణయం మార్చుకొని ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. కాగా విక్రమ్ కె.కుమార్‌తో పాటు సుకుమార్ కూడా ఆస్దాయి దర్శకుడే అనడంలో సందేహం లేదు. కాగా వీరి మద్య ఒకే ఒక్క తేడా ఉంది. క్లిష్టతరమైన సబ్జెక్ట్‌లను కూడా సింప్లిఫై చేసి సామాన్యు ప్రేక్షకులకు కూడా అర్దమయ్యేలా చిత్రాలు చేయడంలో విక్రమ్ కె.కుమార్ ప్రత్యేకత. దానికి మనం, 24 చిత్రాలే ఉదాహరణ, కానీ సుకుమార్ విషయానికి వస్తే సాధారణ సబ్జెక్ట్‌ను కూడా హైవల్ థింకింగ్‌తో సినిమాలు చేస్తుంటాడు. మరి ఈ విషయంలో విక్రమ్‌ను సుకుమార్ స్పూర్తిగా తీసుకుంటే సుకుమార్ కూడా అద్భుతమైన చిత్రాలను చేయగలడనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి సుకుమార్ ఇకనైనా మారతాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!