Advertisementt

అన్ని వెరైటీ గా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్‌...!

Mon 16th May 2016 01:05 PM
jr ntr,janatha garriage,janatha garriage audiolaunch at usa,bunny,mahesh,overseas market  అన్ని వెరైటీ గా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్‌...!
అన్ని వెరైటీ గా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్‌...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్స్‌ పరభాషా చిత్రాలపై, ఇండస్ట్రీలపై కూడా కన్నేస్తున్నారు. దానికి తోడుగా ఓవర్‌సీస్‌లో కూడా తమ మార్కెట్‌ పరిధిని పెంచుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. నేటి యంగ్‌ స్టార్స్‌లో  ఆ విషయంలో మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌లు ముందజలో ఉన్నారు. కాగా ఇప్పుడు తన తాజా చిత్రం జనతాగ్యారేజ్ తో ఎన్టీఆర్‌ కూడా మహేష్‌, బన్నీలకు ఈ విషయంలో సవాల్‌ విసరడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌కు ఓవర్‌సీస్‌లో మంచి ఫలితాలు అందించిన చిత్రాల్లో మొదటిది బాద్‌షా. ఆ తర్వాత ఆయన టెంపర్‌ చిత్రంతో కూడా అదే జోరు సాగించాడు. తాజాగా ఆయన నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం ఓవర్‌సీస్‌లో కాసుల వర్షం కురిపించింది. జనతాగ్యారేజ్‌ ద్వారా ఎన్టీఆర్‌ నాన్నకుప్రేమతో తో సాధించిన మార్కెట్‌ను రెండింతలు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఆయన తన చిత్రం ఆడియోను అమెరికాలోని న్యూజెర్సీలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. గతంలో చాలామంది స్టార్స్‌ తమ ఆడియోలను యుఎస్‌లో చేయాలని ప్లాన్‌ చేసినప్పటికీ అవి వర్కౌట్‌ కాలేదు. కానీ ఈ విషయంలో ఎన్టీఆర్‌ ఎంతో పట్టుదలతో ఉన్నాడు. ఇక ఆడియో సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌తోపాటు విజయవాడ, వైజాగ్‌, తిరుపతి తదితర నగరాల్లో కూడా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. కాగా మాలీవుడ్‌లో బన్నీకి ఉన్న క్రేజ్‌ను తలదన్నే స్ధాయిలో కొచ్చిన్‌లో సినిమా విడుదలకు ముందు పెద్ద ఈవెంట్‌ ప్లాన్‌ చేసి దాని ద్వారా మోహన్‌లాల్‌, నిత్యామీనన్‌లను పబ్లిసిటీకి వాడుకోవాలనే ఆలోచనలో ఎన్టీఆర్‌ అండ్‌ టీమ్‌ ఉంది. మరి ఎన్టీఆర్‌ కలలను జనతాగ్యారేజ్‌ తీరుస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ