రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు వ్యక్తిగత విదేశీ టూర్లలో గడపడం వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు ప్రధాని మోడీ కరువు పరిస్థితులపై సమీక్ష నిమిత్తం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహిస్తే అదేమీ పట్టకుండా బాబు ప్రధాని సమావేశానికి డుమ్మా కొట్టడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. మరోవైపు బాబు చేస్తున్న విదేశీ పర్యటనలపై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో చంద్రబాబు వివేశీ టూర్లకు వెళ్లినప్పుడు ఆయన అనుకూల మీడియా ఎలా వ్యవహరించింది? తాజాగా ఇప్పుడు ఎలా వ్యవహిరిస్తోంది అనే అంశంపై కూడా కేంద్రానికి పలు అనుమానాలు ఉన్నాయట. చంద్రబాబు విదేశీ పర్యటన గురించి టిడీపీ అనుకూల మీడియా వద్దనే కాదు... పార్టీ ముఖ్యనేతలకు కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు? అనే సమాచారం లేదని నిఘా వర్గాల సమాచారం. దీంతో ఈ పర్యటనపై ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టింది. పనామా పేపర్స్ బయటపెడుతున్న అవినీతిపరుల చిట్టాలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరీటేజ్ కంపెనీ డైరెక్టర్ మోటపర్తి శివరామప్రసాద్ పేరు బయటపడటం, ఆ వెనువెంటనే చంద్రబాబు విదేశాలకు పయనం కావడం.. ఇవన్నీ కేంద్రానికి బాబుపై అనుమానాలను రేకెత్తించే విషయాలే. ఎక్కడి వెళ్లారన్నది టిడిపి శ్రేణులకు కూడా తెలియకపోవడం, కేంద్రం దృష్టిలో అన్ని అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.