పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టేటప్పుడు ఆయన వెనక ఉండి అన్ని విషయాలను చూసుకోవడమే కాకుండా, ఆర్దికసాయం కూడా చేసిన వ్యక్తి పొట్లూరి వరప్రసాద్. విజయవాడకు చెందిన ఈ వ్యాపారవేత్త, నిర్మాత, ఫైనాన్షియర్ కిందటి ఎన్నికల్లో విజయవాడ సీటు నుండి పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావించిన మాట వాస్తవం. ఈ విషయంలో ఆయన పవన్ చేత చంద్రబాబుకు కూడా రికమెండ్ చేయించాడు. కానీ రికమండేషన్స్ వద్దని, గెలుపు గుర్రాలకే సీటు ఇద్దామని, పివిపి కంటే కేశినేని నానికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు పవన్‌ను రిక్వెస్ట్ చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయంలో పలుసార్లు అన్ని మీడియాలలో చర్చలు జరిగాయి. అలా పివిపికి విజయవాడ లోక్‌సభ సీటు దక్కలేదు. ఇక ఆపైన పివిపి కనీసం రాజ్యసభ సీటు అయినా తనకు ఇప్పించాలని పవన్ వద్ద మొరపెట్టుకున్నప్పటికీ పవన్ మౌనం వహించాడు. కానీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పివిపి మాట్లాడుతూ... పవన్ తనకు యూరప్‌లో ఉన్నప్పటినుండి తెలుసని, తమ ఇద్దరికీ చేగువేరా అంటే అభిమానమని, ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే విషయంలో తమ ఇద్దరి ఆలోచనలు కలిశాయని పివిపి చెప్పుకొచ్చాడు. కానీ పవన్ జనసేన పేరుతో ఓ నాన్‌పొలిటికల్ ఆర్గనైజేషన్‌ను స్దాపించనున్నాడని తనకు తెలిపాడని, కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి టర్న్ తీసుకున్నాడని ఆయన అంటున్నాడు. నాన్‌పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఆల్‌రెడీ పవన్‌కు కామన్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఉన్న విషయం పివిపి కి తెలియదా? మరి ఆ నాన్‌పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండగానే జనసేన అనే మరో సంస్దను స్థాపిస్తానంటే పివిపి ఎలా నమ్మారు? నిన్న మొన్నటిదాకా పవన్ కాల్షీట్స్ కోసం పివిపి పవన్ చుట్టూ తిరిగిన విషయం నిజం కాదా? చివరకు పవన్ తాను సినిమా చేయలేనని చెప్పి ఆయన ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చివేసిన సంగతి వాస్తవం కాదా..! అనేది పివిపి గారే సెలవివ్వాలి. మరి ఇప్పుడు మాత్రం పివిపి తాను పవన్‌తో సినిమా చేయనని, ఎవరైనా తనకు నచ్చకపోతే వదిలేస్తానే తప్ప వారితో కలిసి ఉండలేనని మాట్లాడుతున్నాడు. మరి పవన్ మనస్తత్వం నచ్చకపోతే ఆయనకుదూరంగాఉండాలా? లేక దగ్గరగా ఉండాలా? అనే నిర్ణయం పివిపి వ్యక్తిగత విషయం. అంతేకానీ పవన్ ఏదో తనను మోసం చేశాడన్న రీతిలో మాట్లాడుతున్న పివిపి ఇంతకాలం ఎందుకు స్పందించలేదు? అనే దానికి సమాధానం ఏమిటి? అని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.