రాధికాఆప్టే... రామ్‌గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో 'లెజెండ్, లయన్' చిత్రాల్లో నటించింది. కాగా ఆ టైం లో ఆమె సౌత్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువని, హీరోయిన్లకు గౌరవం ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో అందరి చూపు బాలయ్య చిత్రాల నిర్మాతలు, దర్శకులపైకి మరలింది. అలాంటిదేమీ లేదు... ఆమెను బాగానే ట్రీట్ చేస్తున్నామని బాలయ్య నిర్మాత, దర్శకులు వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన 'కబాలి' చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్బంగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నన్ను 'కబాలి' టీమ్ హీరోతో సమానంగా ట్రీట్ చేశారు. గతంలో కొన్ని సౌత్ చిత్రాలలో నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. ఇక్కడ హీరోయిన్లను ట్రీట్ చేస్తున్న తీరు చూసి ఇక సౌత్‌లో సినిమాలు చేయకూడదని అనుకున్నాను. కానీ రజనీకాంత్ గారితో అవకాశం అనగానే ఒప్పుకున్నాను. ఈ చిత్రం లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌గా ఫీలయ్యాను. తొలిసారి ఒక సౌత్ సినిమాలో నన్ను హీరోకి సమానంగా ట్రీట్ చేశారు... అని తెలిపింది. అంటే 'కబాలి'లో బాగా ట్రీట్ చేశారు.. అని చెప్పిందంటే ఆమె ఇంతకు ముందు చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.