తన మొదటి చిత్రం 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని. ఇటీవల ఆయన దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా 'సావిత్రి' చిత్రం వచ్చింది. కానీ ఈ చిత్రం అందరినీ నిరుత్సాహపరిచింది. కాగా ప్రస్తుతం పవన్ సాధినేని తన మూడో ప్రయత్నంగా ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఎప్పుడో నాగార్జున, అమల కలిసి నటించిన 'నిర్ణయం' చిత్రంలోని 'హలో గురూ.. ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటలోని ఈ లిరిక్‌నే తన సినిమాకు టైటిల్‌గా పెట్టాడు. ఈ చిత్రాన్ని యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తీయనున్నాడు పవన్ సాధినేని. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుంది? ఆయనకు దర్శకునిగా తొలి కమర్షియల్ హిట్‌ను ఈ చిత్రం అందిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సి వుంది.