Advertisementt

రజనీకి పోటీగా వెంకీ వస్తాడా?

Sat 14th May 2016 08:29 PM
rajinikanth,babu bangaram,venkatesh,kabali,july  రజనీకి పోటీగా వెంకీ వస్తాడా?
రజనీకి పోటీగా వెంకీ వస్తాడా?
Advertisement
Ads by CJ

సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జులై 1న విడుదలకు సిద్దమవుతోంది. కాగా తెలుగులో అదే రోజున వెంకీ నటిస్తున్న 'బాబు బంగారం' కూడా విడుదలకు ముస్తాబవుతోంది. నయనతార డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో 'కబాలి'లాగానే ఈ 'బాబు బంగారం' కూడా లేటవుతూ వస్తోంది. కాగా ఈచిత్రానికి సంబంధించిన టాకీపార్ట్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయిందని సమాచారం. కాగా త్వరలో ఈ చిత్రం యూనిట్‌ పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్‌కు వెళ్లనుంది. 'భలేభలే మగాడివోయ్‌' చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి మారుతి.. వెంకీకి ఎలాంటి హిట్‌ను అందిస్తాడో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ