ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంగా శాలివాహన శకానికి నాంది పలికిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రాన్ని డైరెక్టర్ క్రిష్‌తో కలిసి రాజీవ్‌రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొరాకోలో ప్రారంభమైంది. అక్కడ కీలకమైన యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలయ్య గెటప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు చాలా సమయం ఉంది. అయితే ఈ చిత్రానికి కూడా 'బాహుబలి' టైప్‌లోనే అంచలంచెల పద్దతిలో పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా బాలయ్య గెటప్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను బాలయ్య జన్మదినం సందర్బంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దం అవుతోంది.