అల్లుఅర్జున్ చేసిన 'చెప్పను బ్రదర్' అనే వ్యాఖ్య ఇప్పటికీ అభిమానుల మద్య చిచ్చుపెడుతూనే ఉంది. ఈ చిన్న వ్యాఖ్య చినికి చినికి గాలివానలా, తుఫాన్‌లా మారుతోంది. ఈ వ్యాఖ్యలపై వివాదం వచ్చినప్పటికీ రెండు మూడు రోజుల్లో అంతా సమసి పోతుందని అందరూ భావించారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఎగ్రెసివ్‌గా తీసుకోవడంతో ట్విట్టిర్, ఫేస్‌బుక్స్‌లో ఈ వివాదంపై యుద్దం సాగుతూనే ఉంది. పవన్ ఫ్యాన్స్‌ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాజాగా పవన్ అభిమానులు ఓ పాంప్లెట్‌ను వేసి పంచుతున్నారు. ఇందులో ఇన్‌డైరెక్ట్‌గా బన్నీని టార్గెట్ చేశారు. మొదట పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌తో మొదలైన ఈ వ్యతిరేకత ఇప్పుడు సామాన్య అభిమానుల వరకు చేరింది. అల్లు అర్జున్ దీనిని ఖండించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. దాంతో నాగబాబు ద్వారా పవన్ ఫ్యాన్స్‌తో మాట్లాడించి ఈ వివాదానికి ముగింపు పలకాలని అల్లుఅరవింద్ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను పెద్దగా పట్టించుకోని అల్లుఅరవింద్ మాత్రం ఇప్పుడు నాగబాబు అవసరం రావడంతో ఆయన్ను వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు. మెగాఫ్యాన్స్‌తో నాగబాబుకు 30ఏళ్ల అనుబంధం ఉంది. అయినా కూడా మొత్తానికి మెగాభిమానులకు దూరంగా ఉంటూ తమకంటూ ఓ స్పెషల్ ఫ్యాన్స్‌ని క్రియేట్ చేసుకోవాలని అల్లు ఫ్యామిలీ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే 'అఖిల భారత అల్లు సేన' పురుడుపోసుకుంది. మొత్తానికి బన్నీ ఓ స్టేజికి వచ్చే దాకా మెగాభిమానులను ప్రసన్నం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వేరుకుంపటి పెట్టడానికి సిద్దమవుతున్న అల్లుఅరవింద్, బన్నీల అసలు స్వరూపాలు ఇప్పుడే తెలియశాయని మెగాభిమానులు అంటున్నారు.