Advertisementt

వంశీపైడిపల్లి ఎందుకు తప్పుకున్నాడు?

Sat 14th May 2016 02:41 PM
vamsi paidipally,akhil,nagarjuna,vamsi paidipally next movie,akhil movie confusion continue  వంశీపైడిపల్లి ఎందుకు తప్పుకున్నాడు?
వంశీపైడిపల్లి ఎందుకు తప్పుకున్నాడు?
Advertisement
Ads by CJ

అక్కినేని వంశ మూడోతరం నాయకుడు అఖిల్‌ తన మొదటి చిత్రం 'అఖిల్‌' చిత్రంతోనే పెద్ద డిజాస్టర్‌ను అందుకున్నాడు. అందుకే ఇంతకాలం అయినా తన తర్వాతి చిత్రంపై ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నాడు. నాగార్జునతోపాటు అఖిల్‌ కూడా దాదాపు రెండో చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని భావించారు. ముఖ్యంగా 'ఊపిరి' చిత్రం షూటింగ్‌లో వంశీ టాలెంట్‌ను చూసిన నాగ్‌ అఖిల్‌ రెండో చిత్రానికి వంశీ అయితేనే బాగుంటుందని ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌ నుండి వంశీ పైడిపల్లి తప్పుకున్నాడని తెలుస్తోంది. నాగార్జున, అఖిల్‌లు బాలీవుడ్‌ మూవీ 'యే జవానీ.. హే దివాని' చిత్రాన్ని రీమేక్‌ చేయాలని భావించారు. మొదట్లో దీనికి కూడా వంశీ ఓకే అన్నాడు. కానీ అఖిల్‌తో కూడా రీమేక్‌ సినిమా చేస్తే తనపై రీమేక్‌ స్పెషలిస్ట్‌ అనే చెడ్డ పేరు వస్తుందని వంశీ భావించాడు. దాంతో ఆయన తన సొంత కథతో అఖిల్‌ చిత్రం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. కానీ నాగ్‌, అఖిల్‌లు మాత్రం బాలీవుడ్‌ రీమేకే చేయాలని పట్టుబట్టడంతో వంశీ ఈ ప్రాజెక్ట్‌ నుండి బయటకు వచ్చేశాడని సమాచారం. కాగా వంశీ తన తదుపరి చిత్రాన్ని రామ్‌చరణ్‌ లేదా ఎన్టీఆర్‌లతో చేయాలని భావిస్తున్నాడు. ఈ ఇద్దరితో గతంలో వంశీ 'ఎవడు, బృందావనం' వంటి హిట్‌ సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. మొత్తానికి అఖిల్‌ సెకండ్‌ మూవీ తతంగం మరలా మొదటికి వచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ