Advertisementt

సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న పవన్‌!

Sat 14th May 2016 02:28 PM
pawan kalyan,sentiment,shruti haasan,harish shankar,pawan kalyan movies  సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న పవన్‌!
సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న పవన్‌!
Advertisement
Ads by CJ

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తర్వాత ఎస్‌జె సూర్య దర్శకత్వంలో నటించే విషయంలో పవన్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన తనకు కలిసొచ్చిన శృతిహాసన్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట. 'గబ్బర్‌సింగ్‌'కు ముందు పవన్‌కు, శృతిహాసన్‌లకు కూడా వరుసగా ఫ్లాప్‌ చిత్రాలు వచ్చాయి. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్‌సింగ్‌' పెద్ద హిట్టయి పవన్‌, శృతిహాసన్‌లకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. కాగా తాజా చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ ఫైనల్‌ అయిందని, ఆమెతో అగ్రిమెంట్‌ చేసుకోవడమే మిగిలి ఉన్నదని సమాచారం. కాగా త్వరలో హరీష్‌శంకర్‌తో కూడా పవన్‌ ఓ చిత్రం చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. అందుకోసమే ఇటీవల హరీష్‌శంకర్‌ దాసరిని కలిశాడని అంటున్నారు. దాసరి, పవన్‌ హీరోగా నిర్మించే చిత్రానికి హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్‌ వంటి వ్యక్తి కూడా సెంటిమెంట్లను ఫాలో కావడం ఏమిటని? అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. 'నేను టైమ్‌ని నమ్మను... టైమింగ్‌ను నమ్ముతాను.... నేనొచ్చాక టైమే కాదు.. టైం టేబుల్‌ కూడా మారాలి' అని ఆయన గతంలో చెప్పిన డైలాగులను కొందరు పవన్‌పై సెటైర్లకు వినియోగిస్తున్నారు. సాధారణంగా ఫెయిల్యూర్స్‌ ఎలాంటి వ్యక్తి ఆలోచనలనైనా మార్చివేస్తాయి. దీనికి పవన్‌ మినహాయింపు కాదని అంటున్నారు. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం అలాంటిదేమీ లేదు... పవన్‌, శృతిహాసన్‌లది హిట్‌పెయిర్‌ కాబట్టే మరలా రిపీట్‌ చేయాలని భావిస్తున్నారని, అంతేగానీ అదేమీ సెంటిమెంట్‌ కాదని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ