Advertisementt

చరణ్‌-సుక్కు సినిమాకు డేట్‌ ఫిక్స్!

Sat 14th May 2016 02:20 PM
  చరణ్‌-సుక్కు సినిమాకు డేట్‌ ఫిక్స్!
చరణ్‌-సుక్కు సినిమాకు డేట్‌ ఫిక్స్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'తని ఒరువన్‌' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఆ చిత్రం తర్వాత చరణ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఓ ప్రేమకథను తీయాలని భావించిన సుక్కు.. ప్రస్తుతం తన నిర్ణయం మార్చుకొని ఓ భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రం ఆగష్టులో పూజాకార్యక్రమాలను జరుపుకోనుందని సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే కానుకగా ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ప్రారంభించాలని డిసైడ్‌ అయ్యారు. ఈ చిత్రంలో తమ హీరో చరణ్‌ను సుక్కు ఏవిధంగా చూపెట్టనున్నాడు? అనే అంశం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ