Advertisementt

రేణుదేశాయ్ కి పవన్‌ సాయం!

Fri 13th May 2016 08:35 PM
pawan kalyan,renu desai,help,lakshmi durga,student  రేణుదేశాయ్ కి పవన్‌ సాయం!
రేణుదేశాయ్ కి పవన్‌ సాయం!
Advertisement
Ads by CJ

తమ మద్య వచ్చిన విబేధాల కారణంగా విడిపోయినప్పటికీ పవన్‌కళ్యాణ్‌కు, రేణుదేశాయ్‌కు మద్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. తన పిల్లలు రేణు వద్దనే ఉండటంతో పవన్‌ కూడా తరచుగా రేణును కలిసి వస్తూ, బాధ్యత గల తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నాడు.ఇక విషయానికి వస్తే లక్ష్మీ దుర్గ అనే డిగ్రీ స్టూడెంట్‌ అమ్మాయి హఠాత్తుగా తన తండ్రి చనిపోవడంతో ఎగ్జామ్‌ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఆమె తన పరిస్థితి వివరించినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు. దాంతో ఆమె రేణుదేశాయ్‌కి ట్విట్టర్‌ ద్వారా తన పరిస్థితి వివరించింది. దీంతో ఆ అమ్మాయి పూర్వాపరాలు, ఆమె పరిస్థితి తెలుసుకోవాలని తన మేనేజర్‌కు సూచించింది. ఈ విషయం తెలిసుకున్న పవన్‌ వెంటనే తన మేనేజర్‌ ద్వారా ఆ అమ్మాయిని కలిసి ఫీజు కట్టే ఏర్పాట్లు చేశాడు. దీంతో ఆ అమ్మాయి పవన్‌కళ్యాణ్‌కు, రేణుదేశాయ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ