సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టార్స్ వరకు అందరూ కావాలని కోరుకునే హీరోయిన్ నయనతార, తమిళంలో ఆమె హవా రోజురోజుకీ పెరుగుతోంది. తెలుగులో ఆమె ఏకంగా చిరు సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఆమెది. ఇటీవలే ఆమె మాయ అనే హర్రర్ చిత్రంలో నటించింది. కాగా ప్రస్తుతం ఆమె మరోసారి హర్రర్ జోనర్ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందని కోలీవుడ్ టాక్. త్వరలో కొరియోగ్రాఫర్ కమ్ ఆర్టిస్ట్, దైరెక్టర్ లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో ముని కి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాడు. ఇందులో లారెన్స్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఓ పాత్రకు గాను ఇప్పటికే కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. మరో లారెన్స్ సరసన నటించేందుకు నయనతారకు సంప్రదించగా ఆమె భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసిందట. దానికి ముని టీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నయన లారెన్స్ సరసన నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. సో... నయనతార, కాజల్‌ల చేరికతో ఈ చిత్రంపై మరెన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఇప్పటివరకు ముని సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.