Advertisementt

నిజంగా ఇది 'ధ్రువ' ఫస్ట్‌లుక్కేనా!

Fri 13th May 2016 01:20 PM
dhruva,ram charan,ram charan dhruva 1st look,surendar reddy,geetha arts  నిజంగా ఇది 'ధ్రువ' ఫస్ట్‌లుక్కేనా!
నిజంగా ఇది 'ధ్రువ' ఫస్ట్‌లుక్కేనా!
Advertisement
Ads by CJ

మొత్తానికి రామ్‌చరణ్‌ హీరోగా చేస్తున్న తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌కు 'ధ్రువ' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌ కోసం ఫిజికల్‌గా, లుక్‌ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే నెట్ లో 'ధ్రువ' ఫస్ట్‌లుక్ ఇది అంటూ పై పోస్టర్ హల్చల్ చేస్తుంది. మరి నిజంగా ఇది ఆ మూవీ కి చెందిన పిక్ అవునో కాదో తెలియదు కానీ, మెగా ఫాన్స్ మాత్రం ఈ లుక్ చూసి ఏదేదో ఊహించుకుంటున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు కాగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో ఈ చిత్రం రూపొందనుంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ వరుసగా రామ్‌చరణ్‌తో రెండోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది. ఈ చిత్రం రొటీన్‌ కమర్షియల్‌ చిత్రం మాత్రం కాదు. సమ్‌థింగ్‌స్పెషల్‌గా సాగుతుంది. దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇలా వైవిద్యమైన చిత్రాలు చేస్తూ తనపై పడిన రొటీన్‌ ముద్ర నుండి బయటకు రావాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ