ప్రస్తుతం టాలీవుడ్‌లో తండ్రి కొడుకులు ఓకే చిత్రంలో నటించే ట్రెండ్ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రామ్‌చరణ్ నటించిన 'మగధీర, బ్రూస్‌లీ' చిత్రాల్లో వెండితెరపై కనిపించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి నటించబోయే 150వ చిత్రంలో రామ్‌చరణ్ కూడా కొద్దిసేపు స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఇక నాగార్జున తన కొడుకులిద్దరితో ఇప్పటికే 'మనం'చిత్రంలో నటించాడు. అఖిల్ తొలి మూవీ 'అఖిల్' చిత్రంలో కూడా కాసేపు తెరపై కనిపించాడు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో పాత్రలు పోషించిన బాలకృష్ణ త్వరలో 100వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు. ఇక తన తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో కనిపించిన మహేష్ తన తనయుడు గౌతమ్‌కృష్ణతో '1' (నేనొక్కడినే)లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పూరీ జగన్నాథ్ చిత్రంలో కళ్యాణ్‌రామ్ తన కుమారుడు శౌర్యరామ్‌తో కలిసి నటించనున్నాడు.