వాస్తవానికి నరేంద్రమోడీ అంటే ఎవరో దేశప్రజలకు తెలియక ముందే చంద్రబాబు జాతీయస్ధాయిలో చక్రం తిప్పిన నాయకుడు. మోడీ కంటే ముందే విజన్ 2020 ప్రారంభించి ఏపీకి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన నాయకుడు. దేవగౌడ ప్రధాని పీఠం అధిరోహించే సమయంలో ఆ స్దానంలో చంద్రబాబును పీఎం చేయాలని అందరూ భావించినా తనకు ఆ పదవి ఇప్పుడే వద్దని చెప్పిన నాయకుడు చంద్రబాబు. కానీ చంద్రబాబు దక్షిణాది నేత కావడమే ఆయన పురోభివృద్దికి ఆటంకంగా మారింది. అయన పివి నరసింహారావు, వాజ్‌పేయ్ వంటి రాజకీయ ఉద్దండుల చేత రాజనీతిజ్ఞుడిగా పిలిపించుకున్నాడు. అంతేకాదు.. చంద్రబాబు గ్రేట్ వారియర్. గొప్ప ట్రబుల్ షూటర్. అలాంటి నేత ఏపీకి సీఎం కావడం ముదావహం. కానీ మోడీలా తనకంటే ఘనుడు ఎవ్వరూలేరని విర్రవీగితే మాత్రం ఆయనకు పతనం తప్పదని అంటున్నాయి టిడిపి వర్గాలు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం, ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు వంటివి ఎలా తెచ్చుకోవాలో బాబుకు బాగా తెలుసు. అలాంటి బాబును మోడీ తక్కువ చూపు చూస్తే మాత్రం నష్టపోయేది కేవలం బిజెపినే అని చెప్పకతప్పదు. వాస్తవానికి దేశ ప్రజలు ఎన్నో ఆశలతో మోడీకి పూర్తి మెజార్టీని ఇచ్చారు. కానీ ఆయన చేపట్టిన ఏ పథకం కూడా ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన ఏపీ ప్రత్యేకహోదా అంశమే కాదు.. వందరోజుల్లో విదేశాలలో ఉన్న నల్ల ధానాన్ని దేశానికి తెప్పిస్తానని ఆయన చేసిన హామీ కానీ, అవినీతి నిర్మూలనకు ఆయన తీసుకున్న చేతలు కానీ ఏమీ లేవు. సో.. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, ఎన్డీఏకేకాదు... కాంగ్రెస్, యూపీఎకు కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశాలు లేవు. అలాంటి కీలకమైన సమయంలోనే మూడో ప్రత్నామ్నాయం పురుడు పోసుకోవడానికి, బలపడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాంటి సయయంలో తృతీయఫ్రంట్‌లో జయలలిత, మమతాబెనర్జీ, నితీష్‌కుమార్‌లతో పాటు చంద్రబాబు కూడా కీలకం కానున్నాడు. తన మనసుకు ఏదీ నిజమని తోస్తే దాన్ని బయటపెట్టే జెసీదివాకర్‌రెడ్డి ఆమధ్య చంద్రబాబు పీఎం అవుతారని చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. మరోవైపు బిజెపితో టిడిపి మిత్రపక్షమైనప్పటికీ టిడిపి ఎన్డీఏను వీడితే టిడిపితో కలిసి నడవడానికి సిద్దమేనని సీపీఎం నేత మధు కూడా మద్దతు తెలిపిన విషయాన్ని అంత ఈజీగా కొట్టిపారేయలేం.