ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి గరంగరం చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు జగన్ హడావుడి చేశారు. మరో వైపు చంద్రబాబు కేంద్రాన్ని బతిమాలుకుంటున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంటే, రాజ్యసభలో చర్చ జరుగుతుంటే మన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్కడా నోరువిప్పి మాట్లాడినట్టు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తే రాజ్యసభ సభ్యుని హోదాలో చిరు మాట్లాడకపోవడం పట్ల ఆ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రిగా కూడా కొద్ది రోజులు సేవలందించిన చిరంజీవి కాంగ్రెస్ నాయకుని హోదాలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచిత్రం. చిరు తరహాను చూసే ఇతర కాంగ్రెస్ నేతలు ఆయనను కలుపుకుపోవడానికి ఇష్టపడడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో భవిష్యత్తు ఉండే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి సినిమాలే ది బెస్ట్ అనుకుంటున్నారా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది.