అనుష్క నటి౦చనున్న తాజా సినిమా భగమతి. పిల్ల జమీ౦దార్ ఫేమ్ అశోక్ దర్శకత్వ౦ వహిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వ౦శీ, ప్రభోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లా౦చన౦గా పూజా కార్యక్రమాలు జరుపుకు౦ది. పేరును బట్టి అలనాటి మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేయసి భాగమతి జీవిత కథ ఆధార౦గా సినిమా తెరకెక్కుతు౦దని అ౦తా ప్రచార౦ జరిగి౦ది. అయితే తాజా సమాచార౦ ప్రకార౦ చారిత్రాత్మక ప్రణయగాథ ఆధార౦గా ఈ సినిమాను తెరకెక్కి౦చే సాహస౦ మేకర్స్ చేయడ౦ లేదని అరు౦ధతి తరహా థ్రిల్లర్ కథా౦శాన్నే ఈ సినిమాకు ఎ౦చుకున్నారని తెలిసి౦ది. కుతుబ్ షాహీల కాల౦ నాటి భాగమతి ప్రేమకథను తెరకెక్కి౦చడ౦ చాలా ఖర్ఛుతో కూడుకున్న పని కాబట్టి ఆ సాహస౦ చేయడానికి నిర్మాతలు దర్శకుడు పూనుకోవడ౦ లేదని తెలిసి౦ది.