సమంత బోలెడన్ని లవ్‌స్టోరీలు వినిపించింది. హీరో సిద్ధార్థ్‌తో సమంత ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. కారణాలు తెలియవు కానీ... మధ్యలో బ్రేకప్ అయిపోయింది. అప్పట్నుంచి సమంత ఒంటరి జీవితం గడుపుతోందనే అనుకొంటున్నారంతా. అదే విషయం గురించి ఆమెని అడిగితే... నేను ఒంటరిని అని ఎవరన్నారు? అని కిలకిలా నవ్వేసింది. ఇంతకీ ఎవరితో ప్రేమలో వున్నారు మరి అని అడిగితే మాత్రం సమాధానం చెప్పకుండా అదే నవ్వుతో దాటేసింది. సమంతనే నేను సింగిల్‌ని కాదని చెప్పేశాక ఇక ఆ విషయం సంచలనం కాకుండా ఎందుకవుతుంది? ఇప్పుడింతకీ సమంత ఎవరితో మింగిల్ అవుతోందబ్బా అని ఆరా తీయడం మొదలుపెట్టింది మీడియా. ఇటీవలే 24తో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. త్వరలో అ ఆ, బ్రహ్మోత్సవం సినిమాలతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయా సినిమాల ప్రమోషన్ల కోసం మరో నెల రోజులపాటు మీడియా మధ్య గడపబోతోందామె. 24 సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం మీడియాతో ముచ్చటించింది సమంత. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితం గురించి ఆమెకి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు జవాబుగా తాను ప్రేమలో ఉన్నానని, సింగిల్‌ని మాత్రం కాదని చెప్పకనే చెప్పేసిందామె.