మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి. గతంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎల్.కె. అద్వానీ ఎంతో సంతోషించారు. వాస్తవానికి వాజ్‌పేయ్ బిజెపి అధ్యక్షునిగా ఉన్నకాలంలో ఆ పార్టీకి కేవలం రెండు సీట్లే ఉండేవి. పగ్గం అద్వానీ చేతుల్లోకి వచ్చిన తర్వాతే ఆయన తనదైన శైలిలో రామమందిరం, బాబ్రీ మసీదు, హిందువుల మనోభావాలు అంటూ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చినా కూడా ఆయన తాను కాదనుకొని వాజ్‌పేయ్‌కే పదవీ బాధ్యతలను అప్పగించారు. అంతటి ఘనకీర్తి ఉన్న అద్వానీని మోడీ అండ్ కో పక్కనపెట్టింది. మోడీనే ప్రధానిని చేసింది. అయినా పెద్ద మనిషి అయిన అద్వానీ ఏమాత్రం బహిరంగంగా తన అసమ్మతిని తెలియజేయలేదు. అద్వానీ అనుకులురైన వారిని కూడా మోడీ సర్కార్ పక్కనపెట్టింది. అయినా ఆ బాధను అద్వానీ లైట్‌గా తీసుకున్నాడు. త్వరలో ఆయనను రాష్ట్రపతిని చేయాలనే డిమాండ్ బాగా వినిపిస్తున్నప్పటికీ అది మోడీకి ఇష్టంలేదు. ఇప్పటికీ అద్వానీ దానిని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా అద్వానీని వెన్నుపోటు పొడిచిన మోడీకి ఏపీని వెన్నుపోటు పొడవడం పెద్దగా లెక్కలోది కాదు.. ఆయన్ను ఎరిగిన వారందరూ ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. మరి అద్వానీనే వెనక్కి నెట్టిన మోడీ ఏపీపై మాటపై నిలబడతాడని ఆశించడం అత్యాశే అవుతుంది మరి...!