Advertisementt

అడల్ట్‌ కామెడీ చిత్రంలో దర్శకహీరో!

Tue 10th May 2016 09:47 AM
avasarala srinivas,hunter movie,hunter telugu remake,avasarala srinivas in hunter remake  అడల్ట్‌ కామెడీ చిత్రంలో దర్శకహీరో!
అడల్ట్‌ కామెడీ చిత్రంలో దర్శకహీరో!
Advertisement
Ads by CJ

అవసరాల శ్రీనివాస్‌... నటునిగా టాలీవుడ్‌కు ఎంటరై ఆ తర్వాత దర్శకునిగా కూడా నిరూపించుకున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం 'జో అచ్యుతానంద' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదికాక ఆయన బాలీవుడ్‌లో హిట్‌ అయిన ఓ అడల్ట్‌ మూవీ తెలుగు రీమేక్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నాడని సమాచారం. 'హంటర్‌' పేరుతో బాలీవుడ్‌లో హిట్టయిన ఈ చిత్రం అక్కడ రూపాయి పెట్టుబడికి రెండు రూపాయల లాభం తీసుకొచ్చింది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం హక్కులను నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అయిన అభిషేక్‌ పిక్చర్స్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా నవీన్‌ మేడారం అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో అవసరాల శ్రీనివాస్‌ ప్రధానపాత్రను పోషించనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ద్వారా తాను యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతాననే ఉద్దేశ్యంలో అవసరాల శ్రీనివాస్‌ ఉన్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ