తెలంగాణ టీడీపీలో ఒక్క రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఎవరు మిగిలేలా లేరు. తెలంగాణలో టీడీపీకి మరో గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న గాక మొన్న మాగంటి గోపీనాథ్, అరికేపూడి గాంధీ తెలుగు దేశానికీ వెన్నుముకలా ఉన్న వీరు కూడా టీడీపీని వదిలి టీఆర్ఎస్ గూటికి చేరి చంద్రబాబుకి ఝలక్ ఇచ్చారు. ఉన్న కొద్దిమంది ఎమెల్యే లు కూడా టీఆర్ఎస్ లో చేరిపోతే ఇంకా తె.టీడీపీలో మిగిలేది ఆర్ కృష్ణయ్య, రేవంత్ , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వీరిలో కృష్ణయ్య బిసి పార్టీ అంటున్నాడు. ఇక రేవంత్... కెసిఆర్ అంతు చూసే వరకు వదలడు. ఇక మిగిలింది సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అతను కూడా టీఆర్ఎస్‌లో చేరతాడనే ప్రచారం జరుగుతుంది. కాగా సండ్రతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పాలేరు ఉపఎన్నికకు ముందే టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై సండ్రను మీడియా సంప్రదించగా టీఆర్ఎస్‌లో చేరికపై వస్తున్న వార్తలను ఆయన ఖండించలేదు. తెరాసలో చేరికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సండ్ర చెప్పారు. రేవంత్ ఒక్కడితో పార్టీ నడవదు కాబట్టి.. తెలంగాణా లో ఇక టీడీపీ ని మర్చిపోవడం మంచిదని అంటున్నారు రాజకీయ విమర్శకులు.