కాజల్ అగర్వాల్ పేరు చెబితే చాలు చాలా మంది నిర్మాతలు అమ్మో అంటారు. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క విషయాన్ని కమర్షియల్‌గానే చూస్తుంది. గ్లామర్‌షో చేస్తే ఇంత, లిప్‌కిస్ సీన్ ఉంటే ఇంత? పడకగది సీన్ అయితే ఎక్స్‌ట్రాగా ఇంత? అని ప్రతి ఒక్కదానికి ఓ రేటు చెబుతుందని టాక్. కాగా ఆమె ఇటీవలే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి తాను నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఇలా 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని ప్రమోట్ చేసినందుకుగాను ఆమె పివిపి సంస్ధ నుండి మంచి భారీగానే డిమాండ్ చేసి సాధించుకుందని టాక్. ఇక ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్ సరసన 'నక్షత్రం' అనే చిత్రంలో నటిస్తోంది. వాస్తవానికి కాజల్‌కు 'చందమామ' చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. సో.. తన చిత్రం కాబట్టి కాజల్ పారితోషికం విషయంలో కాస్త సడలింపు ఇస్తుందని దర్శకుడు కృష్ణవంశీ భావించాడట. కానీ పేకాట పేకాటే.. బామ్మర్ధి బామ్మర్దే అన్న తరహాలో కాజల్ అడిగిన రెమ్యూనరేషన్ చూసి నోరు వెళ్లబెట్టడం కృష్ణవంశీ వంతైందని సమాచారం. అందులోనూ ఈచిత్రంలో ఆమె పెద్దగా పేరులేని సందీప్‌కిషన్ సరసన నటించనుండటంతో తాను తీసుకునే రెమ్యూనరేషన్‌ను ఆమె డబుల్ చేసిందని తెలుస్తోంది. మొత్తానికి కాజల్ అంటేనే మన నిర్మాతలు హడలిపోతున్నారు.