టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చేందుకు యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. మొదటగా శృతిహాసన్ పేరు వినిపించింది. ఆ తర్వాత పరిణితి చోప్రా, దీపికాపడుకొనే వంటి బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా అలియాభట్ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్త లో ఎంత నిజం వుందనేది తెలియాల్సి వుంది. ఒకవేళ నిజమైతే.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందని చెబుతున్నారు కాబట్టి అలియాను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారా? లేక సెకండ్ హీరోయన్ పాత్రకు ఎంపిక చేశారా? అనే దానిపై కూడా స్పష్టత రావాలి.