సూర్య హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన '24' చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకుంది. దీన్నో మాస్టర్‌పీస్‌గా విమర్శకులు అభినందిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియాలో నిర్మితమైన సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లోకెల్లా ఈ చిత్రమే అత్యున్నతం అని అందరూ ఒప్పుకొంటున్నారు. కాగా ఈచిత్రంలో సూర్య నటన చూసిన వారు, మరీ ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య చూపించిన పెర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తమిళంలోనే కాదు.. ఈచిత్రం తెలుగు నాట కూడా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల రోజుపై అనేక బాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు కన్నేశారు. మొదటి రోజు టాక్‌ను ప్రామాణికంగా తీసుకున్న కొందరు నిర్మాత, దర్శకులు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో అందరికంటే ముందు హృతిక్‌రోషన్ తండ్రి రాకేష్‌రోషన్ ఉన్నాడు. ఆయన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తన స్వీయనిర్మాణ దర్శకత్వంలో హృతిక్‌రోషన్ హీరోగా రీమేక్ చేయడానికి రెడీ అవుతూ.. ఈచిత్రాన్ని నిర్మించిన స్టూడియోగ్రీన్, సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.