Advertisementt

సుప్రీమ్ వారిని గౌరవించబోతున్నాడు!

Mon 09th May 2016 02:40 PM
supreme movie,sai dharam tej,dil raju,anil ravipudi  సుప్రీమ్ వారిని గౌరవించబోతున్నాడు!
సుప్రీమ్ వారిని గౌరవించబోతున్నాడు!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ హీరోగా 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుప్రీమ్'. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మే 5న విడుదలయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి సుమారుగా 5.77 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దీంతో చిత్రబృందం సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మే 8న సుప్రీమ్ సక్సెస్ మీట్ జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమంలో కొంతమందిని ప్రత్యేకంగా గౌరవించబోతున్నట్లు టాక్. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా..? సినిమా క్లైమాక్స్ ఫైట్ లో ఓ ఆరుగురు వికలాంగులు కనిపిస్తారు. వారు చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకం. విలన్స్ తో వారు చేసే ఫైట్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లో ఇదొకటి. అయితే సుప్రీమ్ టీం  ఈ ఆరుగురు వికలాంగులను ప్రత్యేకంగా అభినందించాలని ఫిక్స్ అయ్యారట. దానికి సుప్రీమ్ సక్సెస్ మీట్ కరెక్ట్ అని భావించి.. కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ